వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముంబై లోకల్ రైల్లో ప్రయాణించిన రాహుల్

అంతకు ముందు రాహుల్ గాంధీ శుక్రవారం ఉదయం 11 గంటల 20 నిమిషాల ప్రాంతంలో శాంతాక్రుజ్ విమానాశ్రయంలో దిగారు. ఆ తర్వాత విద్యార్థులతో ముచ్చటించడానికి భైదాస్ హాల్ కు వెళ్లారు. అక్కడికి కొద్ది కిలోమీటర్ల దూరంలో శివసైనికులు నిరసన తెలియజేస్తూ ప్రదర్శన నిర్వహించారు. శివసేన కార్పొరేటర్ రాజుల్ పటేల్ బారికేడ్లను ఛేదించుకుని ముందుకు పోవడానికి ప్రయత్నించారు. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధేరి, విలే పార్లే, జోగేశ్వరి, ఘట్కోపర్ ల్లో శివసైనికులు గుంపులుగా చేరుకున్నారు.