హైదరాబాద్: కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించిన శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై సరైన సమయంలో స్పందిస్తామని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో శుక్రవారం ఒక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి ఆయన అభిప్రాయాన్ని అడిగారు. ఆ సమయంలో ఆయన ఆ విధంగా అన్నారు. కమిటీ విధివిధానాలపై తగిన సమయంలో తన ప్రతిస్పందనను తెలియజేస్తానని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి