హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు. తెలంగాణ, సమైక్యాంధ్ర డిమాండ్లను సమానంగా ఎలా చూస్తారని ఆయన అడిగారు. ఆ రెండింటిని సమానస్థాయిలో ఎలా పరిశీలిస్తారని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటన స్ఫూర్తికి విరుద్ధంగా కమిటీ విధివిధానాలున్నాయని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి పోయినట్లే కనిపిస్తోందని ఆయన అన్నారు. తమ భవిష్యత్తు కార్యాచరణను జెఎసి సమావేశం తర్వాత వెల్లడిస్తామని ఆయన చెప్పారు.
కమిటీ కాలపరిమితిని కూడా ఆయన వ్యతిరేకించారు. తెలంగాణకు వ్యతిరేకంగా విధివిధానాలున్నాయని ఆయన అన్నారు. కమిటీ కాలపరిమితి కూడా ఎక్కువగా ఉందని, కమిటీ నివేదిక ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉందని ఆయన అన్నారు. డిసెంబర్ 9 ప్రకటన స్ఫూర్తికి విరుద్ధంగా విధివిధానాలున్నాయని ఆయన అన్నారు. విధివిధానాలను పరిశీలిస్తే ప్రభుత్వం డిసెంబర్ 9వ తేదీ పూర్వ స్థితికి వెళ్లినట్లు అనిపిస్తోందని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి