• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రేపు తెలంగాణ బంద్: ఓయు జెఎసి

By Pratap
|

Osmania Jac
హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలకు నిరసనగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది. శ్రీకృష్ణ కమిటీని రద్దు చేసి, పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించాలని డిమాండ్ చేసింది. కమిటీ విధివిధానాలు పూర్తిగా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని జెఎసి విమర్శించింది. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు వెల్లడైన వెంటనే ఉస్మానియా జెఎసి అత్యవసరంగా సమావేశమైంది. కమిటీ విధివిధానాలపై చర్చించింది. కాంగ్రెసు ప్రభుత్వం మరోసారి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, మనోభావాలను దెబ్బ తీసిందని వారు విమర్శించారు. సహాయ నిరాకరణ చేస్తామని, ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధం చేస్తామని ఓయు జెఎసి నాయకులు ప్రకటించారు.

కాగా, ఓయు జెఎసి ఇచ్చిన బంద్ పిలుపునకు కాకతీయ విశ్వవిద్యాలయం జెఎసి మద్దతు ప్రకటించింది. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు వెలువడిన మరుక్షణమే ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విశ్వవిద్యాలయాలకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకోవడం ప్రారంభించారు. దీంతో ఈ రెండు విశ్వవిద్యాలయాల్లోనూ భారీగా పోలీసులను మోహరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X