వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది: విహెచ్

ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయడం మంచిది కాదని, రాజీనామాలు చేస్తే రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తుతుందని ఆయన అన్నారు. రాష్ట్రపతి పాలన వస్తే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఏర్పాటుకే పని చేస్తుందని ఆయన అన్నారు. మధ్యలో ఏమైనా జరగవచ్చుననే ఆవేదన తెలంగాణ ప్రజల్లో ఉండడం సహజమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు చేసిన ప్రకటనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు శ్రీకృష్ణ కమిటీ రోడ్ మ్యాప్ అనుకుంటున్నామని ఆయన అన్నారు.