విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వచ్చే వారం ఉయ్యూరు ఆర్టీసీ డిపోకు ప్రాణం

By Super
|
Google Oneindia TeluguNews

krishna Dist
విజయవాడ: మూతపడిన ఉయ్యూరు ఆర్టీసీ డిపోను వారం రోజుల్లోగా ప్రారంభించాలని నిర్ణయించారు. డిపో ప్రారంభ కార్యక్రమానికి ఆర్టీసీ ఎండీ ప్రసాదరావును ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అదే సమయంలో గవర్నర్‌పేట సీఎన్‌జీ డిపోను కూడా ప్రారంభించడానికి సన్నద్ధం చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) కూడా ఈ నెల 23 న నగరానికి రానున్నట్లు సమాచారం.

2006 తర్వాత జిల్లాలో గన్నవరం, ఉయ్యూరు డిపోలను నష్టాల బాటలో ఉన్నందున మూసివేశారు. డిపోను మూసివేసేనాటికి ఆ ఏడాది ఉత్తమ డిపోగా అవార్డును అందుకుంది. 47 ఆర్టీసీ, 26 అద్దె బస్సులు 336 ట్రిప్పులు నడిపేవారు. ఈ డిపో ఆపరేటింగ్‌ రేషియో 63 నుంచి 70 శాతం ఉండేది. గత ఎన్నికల ముందే వైఎస్‌ ఈ డిపోలను పునఃప్రారంభించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా మొదట ఉయ్యూరు డిపోను ప్రారంభించనున్నారు. ఒక్కోడిపో నుంచి 60 నుంచి 70 సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్యూఆర్‌ఎం బస్సులు పెద్ద సంఖ్యలో నగరానికి రానుండటంతో వాటిని ఉపయోగించుకునేలా డిపోను ప్రారంభించనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X