వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.11.05 లక్షల కోట్లతో ప్రణబ్ బడ్జెట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ 2010-11 సంవత్సరానికి గాను రూ. 11.05 లక్షల కోట్లతో పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఈసారి ఆశ్చర్యకరంగా మౌలిక సదుపాయా ల కల్పనకు రూ.1.73 లక్షల కోట్లు కేటాయించారు. ఆ తర్వాత రక్షణ రంగానికి పెద్ద మొత్తంలో రూ.1.47 లక్షల కోట్లను ప్రతిపాదించారు. అలాగే గ్రామీణాభివృద్ధికి రూ.66వేల కోట్లను, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.44వేల కోట్లను ప్రణాళిక పద్దులో చూపా రు. అలాగే భారత్ నిర్మాణ్ పేరిట ఓ కొత్త పథకం ప్రవేశపెట్టి రూ.48వేల కోట్లను కేటాయించారు. వ్యవసాయ, పరిశ్రమల రంగాలపై సమంగా వరాల జల్లు కురిపించారు.

ప్రణబ్ బడ్జెట్‌లో ముఖ్యాంశాలు :

- 2010-11 సంవత్సరానికి బడ్జెట్ రూ.11.05 లక్షల కోట్లు
- ప్రణాళికేతర వ్యయం రూ.7.35 లక్షల కోట్లు
- ప్రణాళిక వ్యయం రూ.3.70 లక్షల కోట్లు
- ద్రవ్యలోటు 6.96 శాతం
- పన్నుల ద్వారా ఆదాయం రూ.7,46,650 కోట్లు
- పన్నేతర ఆదాయం రూ.1,48,118 కోట్లు
- రక్షణ రంగానికి రూ.1.47 లక్షల కోట్లు
- గ్రామీణ మౌలికసదుపాయాలే యుపిఎ లక్ష్యం
- మౌలిక సదుపాయాలకు రూ.1.73 లక్షల కోట్ల నిధులు కేటాయింపు
- ప్రణాళిక నిధుల్లో 46 శాతం మౌలిక సదుపాయాలకే
- 2014 నాటికి పది శాతం వృద్ధిరేటు లక్ష్యం
- ఈ ఏడాది వృద్ధిరేటు లక్ష్యం తొమ్మిది శాతం
- గ్రామీణాభివృద్ధికి 75 శాతం అదనంగా నిధులు
- గ్రామీణాభివృద్ధికి రూ.66,100 కోట్లు
- గ్రామీణ ఉపాథి హామీ పథకానికి రూ.41,100 కోట్లు
- ఇందిరా ఆవాస్ యోజన పథకానికి రూ.10 వేల కోట్లు పెంపు
- ఆరోగ్య రంగానికి రూ.22,300 కోట్లు
- రైల్వేలకు రూ.16,752 కోట్లు
- విద్యుత్ రంగానికి నిధులు రెట్టింపు
- విద్యుత్ రంగానికి రూ.5,130 కోట్లు
- 2020 నాటికి 20వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యం
- కొత్తగా హైడ్రో, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు
- సోలార్ విద్యుత్ కోసం రూ.1,000 కోట్ల కేటాయింపు
- హైడ్రో విద్యుత్‌కు రూ.500 కోట్లు
- దేశంలోని 98 శాతం ప్రాంతాల్లో ప్రాథమిక్య విద్య అందుబాటులోకి వచ్చింది
- ప్రాథమిక విద్య రంగానికి రూ.31,036కోట్లు
- కొండ ప్రాంతాల అభివృద్ధికి రూ.1000 కోట్లు
- అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత కోసం రూ.1,000 కోట్లతో నేషనల్ సెక్యూరిటీ ఫండ్ ఏర్పాటు
- పట్టణ ఉపాథి హామీకి రూ.5,400 కోట్లు
- బిసి సంక్షేమానికి రూ.7,300 కోట్లు
- గ్రామీణ ప్రాంతాలలో రుణాలకు రూ.3.75 లక్షల కోట్ల రుణ సౌకర్యం
- రైతులకు రుణాల చెల్లింపున జూన్ 30 దాకా గడువు పొడిగింపు
- రుణాలు గడువులోపు చెల్లించిన రైతులకు 5 శాతానికే రుణాలు
- ఎరువుల సబ్సిడీ నేరుగా రైతులకే
- ఏప్రిల్ నుంచి పోషక విలువలతో కూడిన ఎరువుల సరఫరా
- ఈశాన్య రాష్ట్రాలలో వ్యవసాయాభివృద్ధికి రూ.400 కోట్లు
- రాజీవ్ ఆవాస్ యోజన పథకానికి రూ.1,270 కోట్లు
- రూ.48 వేల కోట్లతో మహాత్మాగాంధీ గ్రామీణ క్లీన్ అండ్ గ్రీన్ పథకం * గంగానది ప్రక్షాళనకు రూ.500 కోట్లు
- గంగానదిలో వ్యర్థాలు కలవకుండా గట్టి చర్యలు
- తమిళనాడులో చేనేత పరిశ్రమను ఆదుకునేందుకు రూ.200 కోట్లు
- గోవాలో బీచ్‌ల అభివృద్ధికి రూ.200 కోట్లు
- నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్ ఏర్పాటు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X