హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎయిర్ షోపై ప్రభావం ఉండదు: ప్రఫుల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Praful Patel
హైదరాబాద్: హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో యుద్ధ విమాన ప్రమాదం దురదృష్టకరమని పౌర విమానయానాల మంత్రి ప్రఫుల్ పటేల్ అన్నారు. ఆ ప్రమాదం ప్రభావం ఎయిర్ షోపై ఉండదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇటువంటి విన్యాసాల సందర్భంగా ఇటువంటి ప్రమాదాలు గతంలో కూడా జరిగాయని, ప్రమాదం దురదృష్టకరమని, దీని ప్రభావం ఎయిర్ షోపై ఉంటుందని అనుకోవడం లేదని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎయిర్ షోల్లో నిరుడు ఐదు అటువంటి ప్రమాదాలు సంభవించాయని పౌర విమాన యానాల మంత్రిత్వ శాఖ అంటోంది.

వేయి అడుగుల కన్నా తక్కువ ఎత్తులో విన్యాసాలు చేయడం వల్లనే సూర్యకిరణ్ యుద్ద విమానం ప్రమాదం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ సిఇఓ ఎస్ఎన్ రెండ్డి అన్నారు. విమానాశ్రయం చుట్టుపక్కల ఉన్న సెల్ టవర్లు కూడా ప్రమాదానికి కారణమని ఆయన ఒక తెలుగు టెలివిజన్ చానెల్ తో అన్నారు. ఈ ప్రమాదంతో ఏవియేషన్ షోలో విషాద వాతావరణం నెలకొందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X