వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్ కత్తాలో తెలుగు దీపక్ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Maoists
కోల్ కత్తా: మావోయిస్టు మిలిటరీ వింగ్ అగ్రనేత, మావోయిస్టు నేత కిషన్ జీ ప్రముఖ అనుచరుడు తెలుగు దీపక్ అలియాస్ వెంకటేశ్వర రెడ్డిని ను కోల్ కత్తా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు బుధవారంనాడు ధ్రువీకరించారు. సిపిఐ (మావోయిస్టు) రాషట్ర్ మిలిటరీ కమిషన్ పశ్చిమ బెంగాల్ చాప్టర్ చైర్మన్ గా తెలుగు దీపక్ పనిచేస్తున్నాడు. ఆయనకు కిషన్ జీతో 1995 నుంచి సంబంధాలున్నాయి.

నక్సల్స్ హింసకు సంబంధించిన పలు కేసుల్లో దీపక్ నిందితుడు. తెలుగు దీపక్ ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందినవాడు. రాష్ట్ర నిఘా సంస్థ, కేంద్ర భద్రతా బలగాలు సంయుక్తంగా దీపక్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. పలు రాష్ట్రాల్లో దీపక్ మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ జాబితాలో ఉన్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X