హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిత్ర నిర్మాత గణేష్ ఇంటిపై ఐటి దాడులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ganesh
హైదరాబాద్: నటుడు, నిర్మాత గణేష్ ఇంటిపై ఆదాయం పన్ను శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లో గల ఆయన ఇంటిలో ఐటి శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. గణేష్ నిర్మాతగా రవితేజతో ఆంజనేయులు అనే సినిమాను నిర్మించారు. మరికొన్ని సినిమాలను నిర్మిస్తున్నారు. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అనుచరుడని తెలుస్తోంది.

కాగా, రాష్ట్ర విభజన జరిగితే మంచిదేనన్న బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై మాట్లాడడానికి కేంద్ర మంత్రి, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల మంత్రి వీరప్ప మొయిలీ నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అధ్యయనం చేస్తోందని ఆయన గురువారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X