• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సెక్స్ స్కామ్: రంజితను ప్రశ్నించే అవకాశం

By Pratap
|

Ranjitha
బెంగుళూర్/ చెన్నై: కల్కి నిత్యానంద స్వామి లైంగిక కుంభకోణంలో కర్నాటక పోలీసులు సినీ నటి రంజితను ప్రశ్నించే అవకాశం ఉంది. నిత్యానంద స్వామి రంజితతో లైంగిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వీడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. నిత్యానంద స్వామి కార్యకలాపాల గురించి పోలీసులు రంజితను కూడా ప్రశ్నించాలని అనుకుంటున్నట్లు సమాచారం. నిత్యానంద స్వామి వ్యవహారాలపై కర్నాటక పోలీసులు ఇప్పటికే దృష్టి సారించారు.

నిత్యానంద స్వామి వ్యవహారాల్లో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో దర్యాప్తు మొదలు పెట్టారు. తాము తమిళనాడు పోలీసుల సహకారం తీసుకుంటామని కర్నాటక పోలీసులు చెబుతున్నారు. కాగా, నిత్యానంద స్వామి ప్రచార రథాన్ని చెన్నై పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. రంజితతో కామక్రీడ జరుపుతున్న వీడియోలు బయటపడడంతో నిత్యానంద స్వామిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యానంద స్వామి ఆశ్రమాలకు పోలీసులు భద్రత కల్పించారు. వాటిలో సోదాలు నిర్వహిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X