వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ అనుమానాలపై చెప్పలేను: ప్రఫుల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Praful Patel
న్యూఢిల్లీ: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై ఆయన కుమారుడు, కడప కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యక్తం చేసిన అనుమానాలపై తాను సమాధానం చెప్పలేనని పౌర విమాన యానాల మంత్రి ప్రఫుల్ పటేల్ అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై కొంత మంది వ్యక్తం చేస్తున్న అనుమానాలపై తాను సమాధానం చెప్పలేనని ఆయన అన్నారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదంపై ఆయన గురువారం సంచలన ప్రకటన చేశారు. పైలట్ల తప్పిదం వల్లనే వైయస్ హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు.

విఎఫ్ఆర్ మోడ్ లో ప్రయాణించాలని పైలట్లు నిర్ణయం తీసుకున్నారని, ఇది తప్పని ఆయన అన్నారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదంపై సిబిఐ దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే అనుమానాలు నివృత్తి అపుతాయని ఆయన అన్నారు. జగన్ అనుమానాలు వ్యక్తం చేస్తూ రాసిన లేఖపై సమాధానం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X