వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ మృతిపై అనుమానాలు: గౌరు

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
జూపాడుబంగ్లా (కర్నూలు జిల్లా) దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌ రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంపై ప్రజల్లో పలు అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కాంగ్రెసు నాయకులు గౌరు వెంకటరెడ్డి అన్నారు. జూపాడుబంగ్లాలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయన స్థానిక కాంగ్రెసు నాయకులు పెద్దన్న స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. వైయస్ రాజశేఖర్‌ రెడ్డి దుర్మరణం చెంది ఆరునెలలు గడిచినా ఆయన ప్రమాదానికి గల కారణాలు తెలియకపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు.

అపోహలను తొలగించేందుకు కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ నివేదికను బహిర్గతం చేయాలన్నారు. తాను పార్టీ మారుతానని వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజంలేదన్నారు. తాను మొదటి నుంచి కాంగ్రెసు వాదినేనన్నారు. కొందరు వ్యక్తులు పని కట్టుకుని గోబెల్‌ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ కాతా అంకిరెడ్డి, ఎంపీటీసీ వెంకట స్వామి, కాంగ్రెసు నాయకులు కె రమణారెడ్డి, బుడగజంగాల శేఖర్‌, తిక్కస్వామి పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X