హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రధాని వ్యాఖ్యలు అన్యాయం: కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదారబాద్: ఏకాభిప్రాయ సాధన ద్వారానే తెలంగాణ సాధ్యమని ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం రాజ్యసభలో చేసిన ప్రకటనను తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) కన్వీనర్ కోదండరామ్ తప్పు పట్టారు. శ్రీకృష్ణ కమిటీని ప్రభావితం చేసే విధంగా ప్రధాని ప్రకటన ఉందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఏకాభిప్రాయమంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తూట్లు పొడవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. మెజారిటీ సభ్యుల అంగీకారం లేకపోయినా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రానికి ఉందని ఆయన అన్నారు. ఏకాభిప్రాయమంటే మెజారిటీ సభ్యుల నియంతృత్వాన్ని సమర్థించడమేనని ఆయన విమర్శించారు.

పార్టీలు ఎన్ని అభిప్రాయాలైనా చెప్పవచ్చునన్న శ్రీకృష్ణ కమిటీ ప్రకటనను కూడా ఆయన తప్పు పట్టారు. ఒక పార్టీ రెండు అభిప్రాయాలు చెప్తే దాన్ని రెండు పార్టీలుగా పరిగణించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక పార్టీ ఒకే అభిప్రాయం చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణ నాయకులు తెలంగాణ ఫోరం ఏర్పాటు చేస్తే సరిపోదని, పార్టీపరంగా తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని ఆయన అన్నారు. ఇంటర్ ప్రశ్నపత్రాలు స్థానికంగా దిద్దడం కుదరదని అధికారులు అనడం సరి కాదని ఆయన అన్నారు. ఏ ప్రాంతం పేపర్లు ఆ ప్రాంతంలోనే దిద్దాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక ప్రాంత పేపర్లు మరో ప్రాంతంలో దిద్దితే ప్రస్తుత భావోద్వేగాల వల్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఈ విషయమై రాజకీయ పార్టీల నేతలను కలుస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X