హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ధరల పెంపుపై కదం తొక్కిన ప్రతిపక్షాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదారబాద్: ధరల పెరుగుదల నిరసిస్తూ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు శనివారం హైదరాబాదు కదం తొక్కాయి. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా చేపట్టాయి. తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం సంయుక్త ఆధ్వర్యంలో ఈ మహాధర్నా జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రతిపక్షాల నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను లొంగదీసే వరకు తమ ఆందోళనను ఆపబోమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. నిత్యావసర సరుకులపై కూడా రాష్ట్ర ప్రభుత్వం 14 శాతం వ్యాట్ వేసి పేదల నడ్డి విరిచిందని ఆయన అన్నారు. పెట్రో ధరల పెంపు ద్వారా సామాన్యులు, పేదలపై పెను భారం మోపిందని ఆయన అన్నారు. పేదల పొట్ట కొట్టి ఉపాధి పెంచుతామని ప్రధాని ప్రకటిస్తున్నారని, ఇది సరైంది కాదని ఆయన అన్నారు.

సిబ్సిడీ బియ్యం కోటా పెంపు, రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరా హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల పొట్టలు కొడుతున్నాయని ఆయన విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాదులో కరెంట్ కోత లేకుండా చూశామని ఆయన చెప్పుకున్నారు. అక్రమ నిల్వదారులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ అన్నారు. ఉపాధి హామీ, మధ్యాహ్న భోజన పథకాలకు ప్రభుత్వం తూట్లు పొడిచిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు.

ఈ ధర్నా సందర్భంగా చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకోవడానికి తెలంగాణ న్యాయవాదులు ప్రయత్నించారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమయంలో న్యాయవాదులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య కొద్దిపాటి ఘర్షణ జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X