చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజాలు వెలుగు చూస్తాయి: నిత్యానంద స్వామి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nityananda Swami
చెన్నై: సినీ నటి రంజితతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న నిత్యానంద స్వామి ఒక రహస్య ప్రదేశంలో చిత్రీకరించిన సిడిని తన తరఫు న్యాయవాది ద్వారా ఆదివారం ఎంపిక చేసిన మీడియా కార్యాలయాలకు పంపారు. తాను ఏ విధమైన చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడలేదని ఆయన అన్నారు. తాను గానీ, ఆశ్రమం గానీ చట్టవ్యతిరేకమైన పనులేమీ చేయలేదని అన్నారు. త్వరలోనే వాస్తవాలు వెల్లడిస్తానని, వాస్తవేమిటో కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నానని, అంత వరకు సహనంగా ఉండాలని ఆయన అన్నారు.

తనపై వచ్చిన ఆరోపణల మీద వాస్తవాలను సేకరించే పనిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అతని ప్రసంగాన్ని ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రసారం చేసింది. నిత్యానంద స్వామి లైంగిక కార్యకలాపాలను తాను చిత్రీకరించానని లెనిన్ అలియాస్ నిత్య ధర్మానంద పోలీసులకు చెప్పిన మర్నాడే నిత్యానంద స్వామి ప్రకటన వెలువడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X