మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ: నళినికి మళ్ళీ డిఎస్పీగా ఉద్యోగం

By Santaram
|
Google Oneindia TeluguNews

DSP Nalini
మెదక్‌: తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి కలిగించాలనే ఉద్దేశంతో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినీకి మళ్లీ పోస్టింగ్‌ లభించనుంది. తిరిగి పోస్టింగ్‌ విషయమై ఆమె ప్రభుత్వానికి పెట్టుకున్న అప్పీల్‌ కు ఆదివారం ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత ఏడాది డిసెంబర్‌ 9న డీఎస్పీ పదవికి నళిని రాజీనామా చేశారు. నళిని రాజీనామా చేసిన నాటి రాత్రే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కాగలదని కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించారు.

చిదంబరం ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ ఉస్మానియా యూనివర్శిటీ, మెదక్‌లో జరిగిన పలు తెలంగాణ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. తెలంగాణపై సానుకూల ప్రకటన వెలువడిన నేపథ్యంలో తిరిగి తన కు పోస్టింగ్‌ ఇవ్వాలని కోరుతూ ఆమె డిసెంబర్‌ 18న హోంమంత్రి, డీజీపీలకు దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్‌ 23న తెలంగాణపై కేంద్రం చేసిన రెండో ప్రకటన నేపథ్యంలో సర్వత్రా ఆందోళనలు జరుగుతున్నప్పుడు ఆమె ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు కేంద్ర హోంమంత్రి చిదంబరానికి 19 పేజీల లేఖ రాశారు.

తెలంగాణ ప్రాంతానికి నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని అందులో ప్రస్తావించారు. అయితే నళినీకి పోస్టింగ్‌ విషయమై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొన్ని రోజులుగా పోస్టింగ్‌కు సంబంధించిన ఫైల్‌ ముఖ్యమంత్రి దగ్గరే పెండింగ్‌లో ఉంది. సోమవారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నళినీకి తిరిగి పోస్టింగ్‌ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడటంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X