వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిసెంబర్లోనే నిత్యానంద వీడియో తీశారా?

By Santaram
|
Google Oneindia TeluguNews

Nityananda Swami
బెంగళూరు: నిత్యానంద స్వామీజీకి సంబంధించిన రాసలీలలను కారు డ్రైవర్‌ లెనిన్‌ కుమార్‌ గత ఏడాది డిసెంబర్‌ లోనే చిత్రీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిత్యానంద ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాలు చూసి సహించలేక ఈ వీడియో దృశ్యాలు చిత్రీకరించానని లెనిన్‌ ఇప్పటికే చెన్నై నగర పోలీసు కమిషనర్‌ రాజేంద్రకు సమాచార మిచ్చిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే బీబీఏ చదివిన లెనిన్‌ కుమార్‌ ఒక క్రిమిసంహారక రసాయనాలు తయారు చేసే కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. నిత్యానంద స్వామిజీ ప్రవచనాలు (బోధన)కు ఆకర్షితుడయ్యాడు.

2004లో ఆశ్రమంలో చేరి ధ్యానపీఠానికి సంబంధించిన పుస్తకాలు, సీడీలు విక్రయించేవాడు. 2006వ సంవత్సరంలో బిడది ఆశ్రమం చేరుకొని నిత్యా 'ఆనంద' పర్సనల్‌ కారు డ్రైవర్‌గా మారాడు. స్వామిజీ రాసలీలలు, అనైతిక కార్యకలాపాలను చూసి జీర్ణించుకోలేక ఈ విషయాన్ని భక్తులకు తెలియజేప్పాలనే ఉద్దేశ్యంతో 2009వ సంవత్సరం డిసెంబర్‌లో రాసలీలలు (నిత్యానంద, సినీ నటి) దృశ్యాలు చిత్రీకరించానని లెనిన్‌ అంటున్నాడు.

ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన కార్యక్రమం సందర్భంగా తన దగ్గర అశ్లీల చిత్రాల సీడీ ఉన్నట్లు స్వామిజీ తెలుసుకున్నారు. ఆ తర్వాత సీడీ ఇవ్వాలని చెప్పి తనను బెదిరించారని లెనిన్‌ ఆరోపిస్తున్నాడు. ఇదిలా ఉండగా నిత్యానంద స్వామి రాసలీలల కేసును బెంగళూరు పోలీసులకు అ ప్పగించారని విశ్వసనీయంగా తెలిసింది. లెనిన్‌ ను ఇప్పటికే బెంగళూరు తీసుకొచ్చి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారని సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో అన్ని వివరాలు తెలుస్తాయని పోలీసు వర్గాలు తెలిపాయి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X