వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూరులో కమ్మ మహిళా సంఘం

By Santaram
|
Google Oneindia TeluguNews

Bangalore
బెంగళూరు: ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని దేశంలోనే ప్రప్రథమంగా బెంగళూరు నగరంలో 'కమ్మ మహిళా సౌహార్ధ సహకార సంఘం' స్థాపించాలని ఆ కులానికి చెందిన మహిళలు నిర్ణయించారు. కమ్మవారి దక్షిణ కేంద్రం సహాయ సహకారాలతో త్వరలోనే ఈ సంఘాన్ని ప్రారంభించనున్నట్లు సంఘానికి అధ్యక్షరాలిగా నియమితులైన జాలాది సుభాషిణి తెలిపారు. నగరంలో కమ్మవారి దక్షిణ కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ మహిళా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సుభాషిణితో పాటు నూతన సంఘ సభ్యులు బీ శారద, గీతా భవాని, కట్టా భామణి, ఏ వాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ మహిళలు ఆర్థిక అభ్యున్నతి సాధించాలనే సదుద్దేశ్యంతోనే ఈ సంఘాన్ని స్థాపించాలని తీర్మానించామని తెలిపారు. సంఘంలో కమ్మ వర్గానికి చెందిన మహిళలకు తొలి ప్రాధాన్యతను, ఆ తరువాత ఇతర వర్గాలకు చెందిన మహిళలకు అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు.

కెనరా బ్యాంకులో ఉన్నతాధికారిగా పనిచేసిన వెంకటరమణప్ప, విజయా బ్యాంకులో పనిచేసిన సీ నరసింహమప్ప, స్టేట్‌బ్యాంకులో పనిచేసిన బాలరామప్ప చౌదరి తమను ప్రోత్సహించడం ద్వారానే ఈ సంఘాన్ని స్థాపించాలనే ఆలోచన వచ్చిందన్నారు. సహకార సంఘం ద్వారా ఇంటి నిర్మాణానికి, వాహన కొనుగోలుకు, కుటీర పరిశ్రమల స్థాపన తదితర వాటికి రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సహకార సంఘం ద్వారా పొందిన రుణాలతో మహిళలు టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ, బుట్టలు అల్లడం, ఆహార ఉత్పతులను తయారుచేయడం వంటి స్వయం ఉపాధిపథకాలతో ఆర్జించవచ్చన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X