వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చే నెలలో లోకసభలో మహిళా బిల్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Lok Sabha
న్యూఢిల్లీ: రాజ్యసభ ఆమోదం పొందిన నేపథ్యంలో ఇప్పుడు బిల్లు లోక్‌ సభ ముందుకు వెళ్లనుంది. లోక్‌ సభలో బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టాలన్నది సభా వ్యవహారాల కమిటీ నిర్ణయించాల్సి ఉంది. వచ్చే నెల 7వ తేదీ తర్వాతనే లోకసభలో ప్రతిపాదించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎస్పీ, ఆర్జేడీలు, జేడీయూలో కొంత మంది వ్యతిరేకిస్తున్నప్పటికీ బీజేపీ, వామపక్షాలతో పాటు పలు చిన్న పార్టీలు మహిళా రిజర్వేషన్‌కు అనుకూలంగా ఉండటంతో లోక్‌ సభలో బిల్లు ఆమోదం పొందడం ప్రభుత్వానికి సులభమే అవుతుంది. అయితే రాజ్యసభలోనే తీవ్ర ప్రతిఘటన తెలిపిన ఎస్పీ, ఆర్జేడీ ఎంపీలు అంతకంటే ఎక్కువ ప్రతిఘటననే లోక్‌ సభలో తెలిపే అవకాశాలు స్పష్టంగా ఉన్న విషయాన్ని కొందరు ఎంపీలు ప్రస్తావిస్తున్నారు. ఎంఐఎం కూడా బిల్లును వ్యతిరేకిస్తోంది.

అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడితో ఆర్థిక బిల్లు ఆమోదానికే ఎసరు వచ్చే ప్రమాదం ఉందన్న ఆందోళన కొందరు అధికార పార్టీ ఎంపీల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే బీజేపీ, వామపక్షాలు కోత తీర్మానాలకు సిద్ధమయ్యాయి. మహిళా బిల్లుపై సభ్యుల్లో ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకు బీజేపీ పరోక్షంగా కుట్ర పన్నిందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

తమ సీట్లు కాపాడుకునేందుకు పలువురు ఎంపీలు బీసీ, ముస్లిం ఎంపీలను రెచ్చగొడుతున్న వాతావరణం సెంట్రల్ హాల్‌ లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌ సభలో ప్రవేశపెట్టే సాహసం ప్రభుత్వం నిజాయితీగా చేయకపోచ్చుననని, ఒక వేళ ప్రవేశపెట్టినా, సభ్యుల వ్యతిరేకతను చూసి నాటకీయంగా వెనక్కు తగ్గవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. బిల్లు అమల్లోకి వస్తే 543 మంది సభ్యులుగల లోక్‌సభలో 181 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. దేశంలోని 28 రాష్ట్రాల అసెంబ్లీల్లో 4109 సీట్లకుగాను 1370 సీట్లలో మహిళలు వస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X