వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా బిల్లుపై మమత అలక

By Pratap
|
Google Oneindia TeluguNews

Mamata Banerjee
న్యూఢిల్లీ: మహిళా బిల్లు విషయంలో కాంగ్రెసు తీరుపై తృణమూల్ కాంగ్రెసు నేత, రైల్వే మంత్రి మమతా బెనర్జీ అలక వహించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లుపై తమను కాంగ్రెసు విశ్వాసంలోకి తీసుకోలేదని ఆమె మండిపడుతున్నారు. తాము ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నామని అన్నారు. మహిళా బిల్లుపై వోటింగ్ కు ఈ స్థతిలో తృణమూల్ కాంగ్రెసు దూరంగా ఉండవచ్చు. రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెసుకు ఇద్దరు సభ్యులున్నారు.

మహిళా బిల్లుపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామనే అభిప్రాయాన్ని మన్మోహన్ సింగ్ తమకు కల్పించారని ఆమె అన్నారు. అయితే అకస్మాత్తుగా బిల్లును వోటింగ్ కు తీసుకున్నారని ఆమె విమర్శించారు. ప్రస్తుత పద్ధతిలో మహిళా బిల్లును ఆమోదింపజేసుకోవడం సరి కాదని ఆమె అన్నారు. కాగా, మహిళా బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తున్న ఎస్పీ, ఆర్జెడీ నేతలు ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్ లతో ఆమె భేటీ అయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X