వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా బిల్లుకు రాజ్యసభ ఆమోదం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajya Sabha
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా తీసుకుని యుపిఎ ప్రభుత్వం మహిళా బిల్లును ఆమోదింపజేసుకుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి వీలుగా108వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ విశేష మెజార్టీతో ఆమోదించింది. రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో ఆమోదానికి 155 మంది ఎంపీల మద్దతు అవసరం కాగ ఓటింగ్ సమయానికి యూపీఏకు 165 మంది సభ్యుల బలం ఉంది. ఓటింగ్‌లో 187 మంది పాల్గొనగా 186 మంది మహిళా రిజర్వేషన్లకు జై కొట్టారు. మహిళాభ్యుదయానికి సై అన్నారు.

ప్రస్తుత రూపంలో బిల్లును అడ్డుకునేందుకు మద్దతు ఉపసంహరణ ఆయుధాన్ని బయటికి తీసిన సమాజ్‌వాది, ఆర్జేడీ, జేడీయూ అధినేతల ప్రయత్నాలకు ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీలు లొంగలేదు. ఒక్క తృణమూల్ మినహా యూపీఏలోని భాగస్వామ్య పక్షాలన్నీ బిల్లుకు మద్దతు తెలిపాయి. వాటికి ప్రతిపక్ష బీజేపీ, సీపీఎం, సీపీఐ, అన్నాడీఎంకే, టీడీపీ తదితర పార్టీలు జత కలిశాయి. పెద్దల సభలో మునుపెన్నడూ లేని విధంగా సమాజ్‌వాది, ఆర్జేడీ, ఎల్జేపీలకు చెందిన ఏడుగురు సభ్యులను బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేంత వరకూ సస్పెండ్ చేశారు.

నియోజకవర్గాల పునర్విభజన చట్టం తరహాలోనే ఒక చట్టం తీసుకువచ్చి మహిళలకు కేటాయించే సీట్లను ఎంపిక చేస్తామని కేంద్ర న్యాయ మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చకు రాజ్యసభలో ఆయన సమాధానమిచ్చారు. ఓబీసీ, మైనారిటీ, ఎస్సీ/ఎస్టీ మహిళలకు రిజర్వేషన్‌పై మాట్లాడుతూ 1935 తర్వాత కులాల ఆధారంగా జనాభా గణన లేదని గుర్తు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X