ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెల్ బ్లూ ఫిల్మ్ వ్యాపారుల అరెస్ట్

By Santaram
|
Google Oneindia TeluguNews

Khammam dist
మణుగూరు: మణుగూరు పట్టణంలోని సెల్‌ షోరూంలపై పోలీసు లు దాడిచేసి ఇద్దరు నీలిచిత్రాల వ్యాపారులను అరెస్ట్‌ చేశా రు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మణుగూరు డీఎస్పీ సీహెచ్‌. రాజ్‌కుమార్‌ ఈ కేసు వివరాలను వెల్లడించారు. స్థానికంగా నీలిచిత్రాల వ్యాపారం జోరుగా సాగుతుందని వచ్చిన సమాచారం మేరకు పట్టణంలోని సెల్‌ షోరూంలపై సీఐ కెఆర్‌కె. ప్రసాదరావు, ఎస్‌ఐ సీహెచ్‌. రాజిరెడ్డి దాడులు నిర్వహించి ఆయా దుకాణాల్లోని కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారన్నారు. వాటిని పరిశీ లించగా వెల్‌డన్‌, సెల్‌ ప్లానెట్‌ అనే రెండు షోరూంలకు చెందిన కంప్యూటర్లలో నీలిచిత్రాలు లోడ్‌చేసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కంప్యూటర్ల ద్వారా నీలిచిత్రాలను సెల్‌ఫోన్‌లలో లోడ్‌చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.

దీంతో ఆ రెండు షాపుల యజమానులు శంకర్‌రెడ్డి, శ్రీనివాస్‌ లను అదుపులోకి తీసుకొని వారిపై 292, 293 ఐపీసీతో పాటు 67 ఐటీ చట్టాల కింద కేసులు నమోదుచేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్ల్లు డీఎస్పీ తెలిపారు. ఈ నీలిచిత్రాల వల్ల చెడుమార్గం పడుతున్న యువతను కట్టడి చేసేందుకు ఇకపై వాహనాల తని ఖీల సమయాల్లో వారివారి సెల్‌ఫోన్లను కూడా పరిశీలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎవరి సెల్‌ఫోన్‌లోనైనా ఈ చిత్రాలు ఉన్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించా రు. ఈ సమావేశంలో సీఐ, ఎస్‌లు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X