వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తతో విభేదాలు రాలేదు: రంజిత

By Pratap
|
Google Oneindia TeluguNews

Ranjitha
బెంగళూర్: తన భర్తతో తనకు ఏ విధమైన విభేదాలు రాలేదని నిత్యానంద స్వామితో లైంగిక కార్యకలాపాలు జరుపుతూ వీడియోకు చిక్కిన సినీ నటి రంజిత అంటోంది. ఆమె ఒక తమిళ వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. భర్తతో విభేదాలు వచ్చినట్లు వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని అన్నది. తాను నిత్యానంద స్వామికి సేవలు మాత్రమే అందించానని ఆమె చెప్పింది. ఒక్క రోజులోనే తన శ్వాససంబంధమైన సమస్యను నిత్యానంద స్వామి నయం చేశారని, దాంతో నిత్యానంద స్వామిపై భక్తి ఏర్పడిందని చెప్పింది.

నిత్యానందస్వామితో తన సంబంధాలు పారదర్శకంగా ఉన్నాయని, అనవసరమైన గొడవ చేస్తున్నారని ఆమె అన్నది. ఆహారం అందించడం, మసాజ్ చేయడం వంటి పనులను నిత్యానందస్వామికి నిత్యం అతని గదిలో అందిస్తుంటానని ఆమె చెప్పింది. రాత్రి పొద్దుపోయేవరకు తాను ఉంటానని, అది ఆశ్రమంలోని వారందరికీ తెలుసునని అన్నది. సెక్స్ వీడియోను ఆసరాగా తీసుకుని తాను సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె కొట్టి పారేసింది.

కాగా, సెక్స్ వీడియోపై నిత్యానంద స్వామి ఈ నెల 18వ తేదీన వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిత్యానంద స్వామి ప్రాణాలకు ముప్పు ఉందని, కొద్ది రోజుల తర్వాతనే బయటకు రావాలని నిత్యానంద స్వామికి సలహా ఇచ్చినట్లు నిత్యానంద స్వామి ప్రెస్ కోఆర్డినేటర్ సచ్చిదానంద చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X