వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ టేప్ పై పెదవి విప్పని నిత్యానంద

By Pratap
|
Google Oneindia TeluguNews

Nityananda Swami
బెంగళూర్: ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై నిత్యానంద స్వామి తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే,సినీ నటి రంజితతో తాను లైంగిక కార్యకలాపాలు జరుపుతున్న సెక్స్ టేప్ పై మాత్రం ఆయన మాట్లాడలేదు. మీడియా తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తోందని నిందించాడు. నిత్యానంద స్వామి ఇంటర్వ్యూను ఆయన శిష్యుడు రాజీవ్ మల్హోత్రా యూట్యూబ్ లో పోస్టు చేశాడు.

సెక్స్ టేప్ పై మినహా మీడియాలో వచ్చిన పలు ఆరోపణలపై మీడియా మీద నిత్యానంద స్వామి విరుచుకుపడ్డాడు. మీడియా కథల మీద కథలు అల్లుతోందని, తమ ఆశ్రమం లోపల, వెలుపల భయం సృష్టించడానికి ప్రయత్నిస్తోందని, ప్రజలను ఆందోళకు గురి చేయాలని చూస్తోందని, ఊహాగానాలను ప్రచారం చేస్తోందని అతను విమర్శించాడు.

నిత్యానంద స్వామి ప్రస్తుతం హరిద్వార్ లోని కుంభమేళాలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నిత్యానంద స్వామి బీదాడి ఆశ్రమానికి భూకబ్జాకు పాల్పడినట్లు, ఆశ్రమంలో ఓ భక్తుడి హత్యలో నిత్యానంద స్వామి పాత్ర ఉందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది తనపై మీడియాలో జరుగుతున్న కుట్ర అని అతను అన్నాడు. దీని వెనక ఎవరు ఉన్నారు, ఏం ఉందనే విషయం తనకు బోధపడడం లేదని ఆయన అన్నారు. స్వామి త్వరలోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడని యూట్యూబ్ క్లిప్ లో చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X