హైదరాబాద్: తమ పదవులను రాజీనామాలు చేయాలనే డిమాండ్‌తో పలువురు తెలంగాణ ప్రజాప్రతినిధులను ఆదివారం ఆందోళన కారులు అడ్డుకున్నారు. కరీంగనర్ జిల్లా పెద్దపల్లిలో ఎంపీ వివేక్‌ను తెలంగాణ వాదులు ఘోరావ్ చేశారు. తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురంలో ఎంపీ రాజగోపాలరెడ్డిని ఆందోళనకారులు అడ్డగించారు.
మెదక్ జిల్లా హత్నూర మండలం సిరిపూర్‌లో రాష్ట్ర మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని, కోహిర్ మండల్ దిగ్వాల్‌లో మంత్రి గీతారెడ్డిని తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.