వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిత్యానంద ఎక్కడన్నది సస్పెన్స్

By Santaram
|
Google Oneindia TeluguNews

Swami Nityananda
బెంగళూరు: సినీనటి రంజితతో కామకేళి సల్పుతూ వీడియోలకు దొరికిపోయిన నిత్యానంద స్వామి బెంగళూరులో ఉన్నారని ఒక ఛానల్‌ ప్రసారం చేసింది. మరో ఛానల్‌ బిడది ఆశ్రమంలోనే దాక్కున్నారని పేర్కొంది. ఢిల్లీలో ఉన్నారని ఒకరు, వారణాసి కుంభమేళాలో ఉన్నారని కొన్ని ఛానళ్లు ప్రసారం చేశాయి. దీంతో అయోమయం నెలకొంది. ఆయన వాదనలను వినిపించేందుకు అనువుగా అనుయాయులు వివిధ ఛానళ్ల ప్రతినిధులను మార్గం తెలియకుండా కళ్లకు గంతలు కట్టి నిత్యానంద వద్దకు తీసుకువెళుతున్నట్లు ప్రచారం జరిగింది.

కుంభమేళా పూర్తయిన తరువాత ఒక వారంలోగా వచ్చేస్తానని ఈటీవీ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిత్యానంద తెలిపారు. ఈ ముఖాముఖి శనివారం రాత్రి ప్రసారమైంది. ఆశ్రమంలో భక్తులు ఇచ్చిన విరాళాలకు అన్ని రికార్డులు ఉన్నాయని, భూవివాదాలు ఏమీ లేవని స్పష్టీకరించారు. ముగ్గురు భక్తులు ఆశ్రమానికి ఇచ్చిన దానంలో చట్టబద్ధత ఉందని వివరించారు. ఈ ఆరోపణలొక గుణపాఠమని, ఇకపై జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఈటీవీ కన్నడ ఛానల్‌ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X