• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికాలో మరో తెలంగాణ సంఘం

By Santaram
|
Google Oneindia TeluguNews
Komatireddy Rajagopal Reddy
మిన్నెసోటా: తెలంగాణ లక్ష్యంగా 'మిన్నెసొటా ఏరియా తెలుగు అసోసియేషన్‌'(మాతా) అనే మరో సంఘం అమెరికాలో ఏర్పడింది. ఫిబ్రవరి 13వ తేదీ శనివారంనాడు ప్లిమత్‌లోని ఇండియా ప్యాలెస్‌ రెస్టారెంట్‌లో ఈ సంఘం ఆవిర్భావ కార్యక్రమం జరిగింది. స్వల్పకాల పర్యటన కోసం అమెరికా వచ్చిన నల్గొండ జిల్లా భోన్‌గిర్‌ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న పరిణామాలపై ప్రసంగించిన ఎంపీ రాజగోపాల్‌ రెడ్డి ఇందుకు సంబంధించి పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

ఈ సందర్భంగా తెలంగాణ కోసం, ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న 'మాతా' కృషిని అభినందించారు. తెలంగాణ రాష్ట్ర పునరావిర్భావంలో తెలంగాణకు చెందిన ఎన్నారైలు కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చిన ఆయన తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఎంపీ రాజగోపాల్‌రెడ్డిని సత్కరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X