హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం: మొయిలీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
హైదరాబాద్: త్వరలో తెలంగాణలో జరిగే శాసనసభ ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపి శాసనసభ్యులు రాజీనామా చేయడంతో తెలంగాణలో కొన్ని శాసనసభా స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. రాజీనామా చేసినవారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే జెఎసి ప్రతిపాదనను ప్రస్తావించగా ప్రజాస్వామ్యంలో పోటీ చేయడం తప్పు కాదని ఆయన అన్నారు.

మంత్రివర్గ విస్తరణ కోసం ముఖ్యమంత్రి కె. రోశయ్య నుంచి ఏ విధమైన ప్రతిపాదన రాలేదని, వస్తే తాము పరిశీలిస్తామని మొయిలీ బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. హైదరాబాద్ ఫ్రీజోన్ పై సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించిన తర్వాత స్పందిస్తానని ఆయన చెప్పారు. వచ్చే ఏప్రిల్ ప్రారంభమయ్యే రెండో విడత బడ్జెట్ పార్లమెంటు సమావేశాల్లో లోకసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు. బిసీ లెక్కలు అందుబాటులో లేనందున ఇప్పట్లో మహిళా బిల్లులో ఒబిసి కోటా ప్రవేశపెట్టే వీలు లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X