ఖానాపురం: ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత శాఖమూరి అప్పారావు సంస్మరణ సభను ఖానాపురంలో ఈనెల 26న నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు, స్నేహితులు మంగళవారం నిర్ణయించారు. పెద్దకర్మ నిర్వహించి, స్మారక సభ సొంత ఖర్చుతోనే ఏర్పాటు చేయనున్నట్లు అప్పారావు తల్లిదండ్రులు సరోజనమ్మ, కోటేశ్వర్‌రావు, సోదరులు సాంబశివరావు, కృష్ణారావు, వీరయ్య, హరిబాబు చెప్పారు.
అప్పారావు ఎదుటి వారి మాటలకు ఎప్పడూ విలువ ఇచ్చేవాడని, ఎవరి సాయం కోసం ఎదురుచూసేవాడు కాదన్నారు. అప్పారావు అభిమానులు సభ నిర్వహణకు సాయం చేస్తామన్నా తిరస్కరించామన్నారు. కాగా, సంస్మరణ సభకు వరంగల్, భద్రాచలం, మెదక్ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది.