అసభ్య ఆయిల్ బాబాపై కేసు నమోదు

Medak Dist
మెదక్: జిల్లాలోని న్యాయ్ కల్ మండలం హుసేన్‌ నగర్‌ శివారులో ఓ వ్యక్తి రోగాలను నయం చేస్తానని ప్రజలను మోసగిస్తూ, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. విషయం తెలుసుకున్న బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు ఆయిల్‌ బాబా అనే ఆ ప్రబుద్ధుడి గుట్టురట్టు చేశారు. ఈ విషయమై బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు విలేకరులతో మాట్లాడుతూ ఆయిల్‌ బాబా మోసాలను వెల్లడించారు. వడ్డి గ్రామానికి చెంది న గురప్ప అలియాస్‌ గురుదాస్‌ బాబా అలి యాస్‌ ఆయిల్‌ బాబా కొన్నేళ్లక్రితం చీకుర్తి గ్రామానికి వలస వెళ్లాడు.

అక్కడే రాళ్లు కొడు తూ జీవనంసాగించేవాడు. ఈ క్రమంలో మతం మార్చుకొని ఆయిల్‌ బాబాగా అవతారమెత్తాడు. హుసేన్‌ నగర్‌ గ్రామ శివారులో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని రోగాలను నయం చేస్తానంటూ ప్రచారం చేసుకోడంతో ఆశ్రమానికి ప్రజల తాకిడి ప్రారంభమైంది. 10 సంవత్సరాలుగా ఆయిల్‌బాబా మోసాలకు పాల్పడు తున్నా ఇన్నాళ్లూ గుట్టుగా సాగిపోయింది. ఆశ్రమానికి వచ్చే రోగులచేత మొదట్లో ప్రార్థనలు చేయిస్తాడు. అనంతరం రోగులు తెచ్చుకున్న కొబ్బరి నూనెను కొద్దిగా వారి నోట్లో వేస్తాడు. మిగతా నూనెతో గొంతు వద్ద, నాభి వద్ద రాస్తా డు.

ఫలితంగా మహిళలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. రోగం నయమవుతుం దనే ఆశతో ఇలాంటివి మౌనంగా భరిస్తున్నారు. మోసాలపై నిలదీసేందుకు ఆశ్రమానికి వెళ్లగా తమపై దాడికి యత్నించినట్లు బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, న్యాల్‌కల్‌ ప్రాంతాల బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు బుధవారం రాత్రి హద్నూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హద్నూర్‌ ఏఎస్‌ఐ శివరాజ్‌ను వివరణ కోరగా ఆశ్రమంలో మత మార్పిడులు జరుగుతున్నాయని, ఇందుకు పాల్పడుతున్న గురుదాస్‌ బాబాపై చర్యలు తీసుకోవాలని బజరంగ్‌ దళ్‌ కార్యకర్తల నుంచి ఫిర్యాదు అందిందన్నారు. వారి ఫిర్యాదు మేరకు గురువారం విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+