చంద్రబాబు తలకు ఫ్రీజోన్ బొప్పి

ఫ్రీజోన్ పై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని బుధవారం శాసనసభలో గట్టిగా పట్టినవారు తెలుగుదేశం పార్టీవారే కావడం విశేషం. తెలంగాణకు చెందిన నాగం జనార్దన్ రెడ్డి తదితర శాసనసభ్యులు తీర్మానం చేయాల్సిందేనని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. అయితే, తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నాయకులు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాంతాలవారీగా ఫ్రీజోన్ పై అభిప్రాయం తీసుకోవాలని సీమాంధ్రకు చెందిన దేవినేని ఉమామహేశ్వర రావు వంటి సీమాంధ్ర శాసనసభ్యులు అంటున్నారు. తీర్మానం పెడితే వోటింగ్ కూడా పెట్టాలని వారంటున్నారు. ఈ రోజు తీర్మానాన్ని ఆమోదిస్తే తెలంగాణ ఇచ్చినట్లేనని వారంటున్నారు. ముఖ్యమంత్రి కె రోశయ్య తన పదవిని కాపాడుకోవడానికి తీర్మానం ప్రతిపాదిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.
తెలుగుదేశం నాయకులు ప్రాంతాలవారీగా చీలిపోయి బహిరంగ వివాదాలకు దిగే పరిస్థితి వచ్చింది. తెలంగాణకు చెందిన రేవూరి ప్రకాశ్ రెడ్డి, సీమాంధ్రకు చెందిన యనమల రామకృష్ణడు పరస్పరం తగాదాకు దిగారు. ఇరు ప్రాంతాల నాయకుల మధ్య విభేదాలు మరింతగా ముదురుతున్నాయి. ఈ స్థితిలో చంద్రబాబు తెలుగుదేశం నాయకులతో టెలీ కాన్పరెన్స్ నిర్వహించి ఫ్రీజోన్ పై మాట్లాడుతున్నారు.












Click it and Unblock the Notifications