నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెల్లూరులో ఇంటర్ పేపర్ లీక్, 10 మంది అరెస్టు

By Santaram
|
Google Oneindia TeluguNews

Nellore
నెల్లూరు: నెల్లూరు నగరంలోని కృష్ణచైతన్య కళాశాలలో ఇంటర్‌ పరీక్షా పత్రాలు లీక్‌కావడం సంచలనం సృష్టించింది. కళాశాలకు చెందిన కొందరు సిబ్బంది పరీక్షకు ముందే ప్రశ్నాపత్రాలను బయటకు తీసుకువెళుతుండగా స్పెషల్‌ పార్టీ పోలీసులు వారిని పట్టుకోవడంతో లీక్‌ వ్యవహారం బయటపడింది.

ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజిక్స్ పేపర్ ను పరీక్ష సమయానికి ముందే సిబ్బంది కొందరు విద్యార్ధులకు లీక్ చేశారు. మూడు రోజుల క్రితమే అనుమానం వచ్చిన పోలీసులు కళాశాలపై నిఘాపెట్టారు. ఈ సందర్భంగా నలుగురు విద్యార్ధులను, ఆరుగురు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కళాశాల యాజమాన్యం పరారీలో ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X