హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెభాష్ చిరంజీవి: లగడపాటి ఆనందం

By Santaram
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: హైదరాబాద్‌ ఫ్రీజోన్‌ తీర్మానాన్ని వ్యతిరేకించిన చిరంజీవిని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ 'శభాష్‌'అని ప్రశంసించారు. దీనివల్ల కలిగే నష్టం గురించి చిరంజీవి అర్థంచేసుకున్నంతగా మిగతా నాయకులు అర్థంచేసుకోలేకపోయారని శుక్రవారం ఇక్కడ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరిస్తే రంగారెడ్డి జిల్లావాళ్లు హైదరాబాద్‌ జిల్లాలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తుచేయడానికి వీలుండదని లగడపాటి పేర్కొన్నారు. ఇప్పటికే అర్హులైన అభ్యర్థులు రాక హైదరాబాద్‌ లో ఏటా వందలాది పోస్టులు ఖాళీగా ఉంటున్నాయన్నారు.

"దీనిపై హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ఎంపీలు తప్ప మిగతా 40 మందితో మాట్లాడాలనుకుంటున్నా. ఇప్పటికైనా చిరంజీవి చెప్పిన మాట వినాలి. అసెంబ్లీలో చర్చ జరగకుండా తీర్మానాన్ని ఆమోదించడం వల్ల 22 జిల్లాలకు అన్యాయం జరుగుతుందన్న విషయం చెప్పడానికి వీలులేకపోయింది. ఢిల్లీలోని కానిస్టేబుల్‌ పోస్టులకు దేశంలోని అన్నిరాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అలాంటిది హైదరాబాద్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు రాష్ట్రంలోని వారికి అవకాశం ఇవ్వకపోతే ఎలా?" అని ప్రశ్నించారు. తెలుగు మాండలికాలు, సంస్కృతి, పండగల మీద శ్రీకృష్ణ కమిటీకి నాలుగో నివేదిక ఇచ్చినట్లు లగడపాటి రాజగోపాల్‌ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X