తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమలలో దర్శనానికి 10 గంటలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుపతి: కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. 28 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వేచివున్నారు. శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు భక్తులకు 10 గంటల సమయం పడుతోంది.

ఇలా ఉండగా శ్రీకోదండరామస్వామి సూర్యప్రభ వాహ నంపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజు శనివారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ, రాత్రి చం ద్రప్రభ వాహన సేవలు వైభవంగా జరిగాయి. ఉదయాన్నే స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్ర నామార్చనతో పాటు నిత్య పూజా కైంకర్యాలు వేడుకగా నిర్వహించారు.

వాహన మండపంలో కొలువు దీర్చిన సీతారామలకణులకు స్నపన తిరుమంజనం, అభిషేక కైంకర్యాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో స్వామివారిని శోభాయమానంగా అలంకరించారు. భానుడి ఉదయ కిరణాలు భూమిపై విరజిమ్ముతున్న సమయంలో సూర్యప్రభ వాహనంపైన కోదండరాముడ్ని కొలువుంచి నాలుగు మాడ వీధుల్లో విహరింపజేశారు. దారి పొడవునా వేచి ఉన్న భక్తులు స్వామివారిని తిలకించి కర్పూర హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో లోకల్‌ టెంపుల్‌ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో సుబ్రమణ్యంరెడ్డి, సూపరింటెండెంట్‌ భాస్కర్‌, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ సుందరనాయుడు, ఆలయ ప్రధాన అర్చక బృందం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X