విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడ కృష్ణలో 'సిడ్నీ ఒపెరా' ప్లాన్

By Santaram
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: కృష్ణా రిజర్వాయర్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆస్ట్రేలియాలోని 'సిడ్నీ ఒపెరా'ను పోలిన కట్టడం సాక్షాత్కరించనుంది. నగర పాలక సంస్థ కోరుకుంటున్నట్లు ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ నితీష్‌రాయ్‌ భవానీపురంలోని కృష్ణా రిజర్వాయర్‌ ఒడ్డున కృత్రిమ బీచ్‌ తరహాలో 'వైఎస్సార్‌ సాంస్కృతిక కేంద్రం'కు రూపకల్పన చేశారు. దీని డిజైన్‌ను 'సిడ్నీ ఒపెరా' తరహాలో పోలి ఉంటుందని నితీష్‌రాయ్‌ తెలిపారు. కృష్ణా రిజర్వాయర్‌ ఒడ్డున, ప్రస్తుతం కార్పొరేషన్‌ హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ స్థానంలో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం ఆయన డిజైన్లు రూపొందించారు.

ఈ డిజైన్లను అధికారులకు చూపడానికి నగరానికి మంగళవారం వస్తున్నారు. ఈ మేరకు ఆయన వర్తమానం పంపారు. ఈ డిజైన్లను ఆయన అధికారుల ముందు ప్రదర్శించి వారికి వివరించనున్నారు. సిడ్నీ ఒపెరా తరహాలో చేపట్టే ఈ నిర్మాణానికి కార్పొరేషన్‌ 'వైఎస్సార్‌ సాంస్కృతిక కేంద్రం'గా పేరు పెడుతోంది. రిజర్వాయర్‌లోని నీటి భాగంలో కూడా కొంత నిర్మాణం జరిగే ఈ డిజైన్‌ ప్రకారం ఇక్కడ 75 గదుల బడ్జెట్‌ హోటల్‌ కూడా ఉంటుంది. అందమైన ఫౌంటైన్లు, అద్భుతమైన ల్యాండ్‌ స్కేపింగు ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X