వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్నిప్రమాదం మృతులు 23 మంది

By Pratap
|
Google Oneindia TeluguNews

Kolkata
కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తాలోని పది అంతస్థుల స్టీఫెన్ హౌస్ భవనంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 23 మంది మరణించారు. గత రాత్రి పైర్ బ్రిగేడ్ అధికారులు ఆరో అంతస్థులోంచి పది మృతదేహాలను వెలికి తీశారు. దీంతో మృతుల సంఖ్య 23కు చేరింది. బుధవారం మరిన్ని మృతదేహాలు బయట పడవచ్చునని అనమానిస్తున్నారు. 30 మంది గాయపడ్డారు.

మృతులు స్త్రీలా, పురుషులా అనేది కూడా తేల్చలేకుండా శరీరాలు కాలిపోయాయని అధికారులు చెబుతున్నారు. పలువురి జాడ కనిపించడం లేదని ఫిర్యాదులు అందుతుండడంతో అధికారులు ఇంకా అన్వేషన జరుపుతూనే ఉన్నారు. గత రాత్రి పదిన్నర గంటలకు మంటలను అదుపు చేయగలిగారు. ఆరుగురిని మాత్రం అధికారులు గుర్తించారు. కాగా, సంఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మొత్తం 40 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడగలిగారు. గవర్నర్ ఎంకె నారాయణన్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. తృణమూల్ కాంగ్రెసు నేత మమతా బెనర్జీ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X