అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీ వ్యభిచార కూపంలో ఇంకా 60 మంది

By Santaram
|
Google Oneindia TeluguNews

Anantapur
అనంతపురం: డిల్లీ జి.బి.రోడ్‌లో గల వ్యభిచార గృహంలో కదిరి ప్రాంతానికి చెందిన 60మంది మైనర్‌ బాలికలు బలవంతపు వృత్తిలో నెట్టబడి మగ్గుతున్నట్లు రెడ్స్‌ స్వచ్చంద సంస్ధ అధ్యక్షురాలు భానుజా, ప్రతినిధి చంద్రలు తెలిపారు. ప్రస్తుతం వచ్చిన బాలికను విడిపించేందుకు తాము డిల్లీకి వెళ్లామని, అక్కడి పోలీసుల సహకారంతో ఈనెల 19న తాము వ్యభిచార గృహం తనిఖీకి వెళ్లినప్పుడు ముందే కదిరి నుంచి సమాచారం అందుకున్న నిర్వాహకులు 60మందిని దాచేసి, ప్రస్తుతం వెనక్కి వచ్చిన బాలికను పంపేసినట్లు వారు పేర్కొన్నారు.

ఒక రోజు ముందు డిల్లీ పోలీసులు తనిఖీ చేసి ఉంటే 60మంది బాధితులకు విముక్తి లభించేదన్నారు. డిల్లీలో క్రికెట్‌ మ్యాచ్‌ ఉన్నందున 18వ తేదిన పోలీసులు తనిఖీకి వచ్చేందుకు వీలుకాదని, మరుసటి రోజు వచ్చారన్నారు. అయినా తాము డిల్లీ వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న కదిరి ప్రాంతా బాధితులందరినీ విముక్తులనుచేసే వరకూ విశ్రమించమన్నారు. మీడియా, పోలీసులు, ప్రజాప్రతినిధులు తమవంతు సహకారం అందిస్తే వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న వారికి విముక్తి కల్పించడమే కాకుండా, ఈ దురాచారాన్ని ఎండగట్టవచ్చని వారు కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X