కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పర్యాటక కేంద్రంగా వైయస్ స్మృతి వనం

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
కర్నూలు: వైయస్ఆర్‌ మృతి చెందిన పావురాలగుట్ట అటవీ పరిధిలోని 1500 హెక్టార్లలో స్మృతివనం ఏర్పాట్లు జరగనున్నాయి. రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలపడంతో వెలుగోడు అటవీ రేంజ్‌ పరిధికి ఎనలేని ప్రాధాన్యత వచ్చింది. ఈ ప్రాంతంలో వివిధ వృక్ష జాతుల మొక్కలతో పాటు జింకలు, కుందేళ్లతో పాటు వివిధ పక్షులతో పాటు అంతరించి పోతున్న వివిధ జంతు జాతులను స్మృతివనం పరిధిలో పెంచేందుకు అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. వైయస్ఆర్‌ అభిమానులకు స్మృతివనం ఏర్పడి తే ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారనుంది.

పావురాలగుట్ట వద్ద వైయస్ఆర్‌ స్థూపావిష్కరణ ఏర్పాటు చేయాలని ప్రస్తుత కాంగ్రెసు ప్రభుత్వ కేబినెట్‌ వైయస్ఆర్‌ మృతి చెందిన సెప్టెంబర్‌ 2వ తేదీన నిర్ణయం తీసుకొంది. అప్పటి నుంచి రాష్ట్రంలో నలుమూల ప్రాంతాల నుంచి పావురాలగుట్టకు తరలి వస్తున్న వైయస్ఆర్‌ అభిమానులు స్థూపావిష్కరణ పనులు ఎప్పుడు జరుగుతాయోనని ఎదురు చూస్తున్నారు.

రాష్ట్ర కేబినెట్‌ స్మృతివనం కోసం ఆమోదం ఓ వైపు ప్రకటించగా, మరో వైపు మంగళవారం నల్లకాలువ వద్ద స్మృతివనం ఏర్పాట్ల కోసం హద్దులకు స్మృతివనం ఫారెస్టు రేంజ్‌ ఆఫీసరు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సర్వే చేశారు. అటవీ భూమితో పాటు వివిధ రైతులకు చెందిన మరో 22 ఎకరాల భూములను పరిశీలించారు. ఎట్టకేలకు పావురాలగుట్ట ప్రదేశంలో స్మృతివనం ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలపడంతో ఈ ప్రదేశం త్వరలో కొత్త రూపులు సంతరించుకోనుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X