పర్యాటక కేంద్రంగా వైయస్ స్మృతి వనం

పావురాలగుట్ట వద్ద వైయస్ఆర్ స్థూపావిష్కరణ ఏర్పాటు చేయాలని ప్రస్తుత కాంగ్రెసు ప్రభుత్వ కేబినెట్ వైయస్ఆర్ మృతి చెందిన సెప్టెంబర్ 2వ తేదీన నిర్ణయం తీసుకొంది. అప్పటి నుంచి రాష్ట్రంలో నలుమూల ప్రాంతాల నుంచి పావురాలగుట్టకు తరలి వస్తున్న వైయస్ఆర్ అభిమానులు స్థూపావిష్కరణ పనులు ఎప్పుడు జరుగుతాయోనని ఎదురు చూస్తున్నారు.
రాష్ట్ర కేబినెట్ స్మృతివనం కోసం ఆమోదం ఓ వైపు ప్రకటించగా, మరో వైపు మంగళవారం నల్లకాలువ వద్ద స్మృతివనం ఏర్పాట్ల కోసం హద్దులకు స్మృతివనం ఫారెస్టు రేంజ్ ఆఫీసరు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సర్వే చేశారు. అటవీ భూమితో పాటు వివిధ రైతులకు చెందిన మరో 22 ఎకరాల భూములను పరిశీలించారు. ఎట్టకేలకు పావురాలగుట్ట ప్రదేశంలో స్మృతివనం ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఈ ప్రదేశం త్వరలో కొత్త రూపులు సంతరించుకోనుంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!