అసెంబ్లీ: ముస్లిం కోటాపై ఆక్బరుద్దీన్ పట్టు

స్పీకర్ ఛేంబర్ ఖరారైన ఎజెండా ప్రకారం సభను నడుపుకుందామని ముఖ్యమంత్రి కె రోశయ్య చెప్పారు. సమయాన్ని వృధా చేస్తూ సమయం లభించడం లేదని వాదించడం సరి కాదని ఆయన అన్నారు. చైర్ లో ఎవరు ఉన్నా వారిని గౌరవించడం అవసరమని ఆయన ప్రతిపక్ష సభ్యులకు సూచించారు. బిఎసిలో నిర్ణయించిన ఎజెండా ప్రకారం సభను నిర్వహించుకోలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన ఏడు అంశాలపై చర్చను ఎప్పుడు చేపడుతారో చెప్పాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అడిగారు. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి పదే పదే నచ్చజెప్పడంతో అక్బరుద్దీన్ తన పట్టు వీడారు. దీంతో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications