ఆరోగ్యశ్రీపై శాసనసభలో దుమారం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వాస్పత్రులు సక్రమంగా ఉంటే ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు ఎందుకు పోతారని ఆయన అడిగారు. ప్రభుత్వాస్పత్రులను మెరుగు పరచడానికి తాము శతవిధాలా ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి సమాధానంతో చంద్రబాబు సంతృప్తి చెందలేదు. తమకు నిరసన వ్యక్తం చేసే హక్కు ఉందని ఆయన చెప్పారు. ఈ సమయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని మంత్రులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యను తప్పు పట్టారు. అందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఆయన పట్టు బట్టారు. చంద్రబాబు వ్యాఖ్యను రికార్డులనుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications