చిరంజీవితో బొత్స సత్యనారాయణ భేటీ

Chiranjeevi
హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారంనాడు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని కలుసుకున్నారు. ఈ నెల 29వ తేదీన బొత్స సత్యనారాయణ కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీల శాసనసభ్యులకు విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు బొత్స సత్యనారాయణ చిరంజీవిని ఆహ్వానించినట్లు చెబుతున్నారు.

రాష్ట్ర విభజన విషయంలో తన వాదన సమర్థనీయమేనని ఆయన అన్నారు. త్వరలోనే తాను శ్రీకృష్ణ కమిటీకి నివేదిక సమర్పిస్తానని ఆయన చెప్పారు. కాగా, వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ప్రజారాజ్యం, కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు కలిసి పనిచేసే విషయంపై బొత్స చిరంజీవితో మాట్లాడినట్లు సమాచారం. చిరంజీవి తన బావమరది అల్లు అరవింద్ కోసం ఒక రాజ్యసభ సీటును అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+