మరోసారి వైయస్ జగన్ తో రామోజీ ఢీ

విజయలక్ష్మీ ఇండస్ట్రీస్ కర్నూలు జిల్లా అవుకులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అధికారుంలో ఉన్నప్పుడే భూములను లీజుకు పొందిందని సాక్షి తెలిపింది. ఆ సంస్థ చేసుకున్న దరఖాస్తు మేరకు 2004లో గనుల లీజుకు ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే వైయస్ మరణించే వరకు కూడా ఆ భూముల ద్వారా ఆ సంస్థ ఒక్క పైసా ఆదాయం పొందలేదని స్పష్టం చేసింది. ఫొటోలు వేరే విషయం, వేరే వారి అభిప్రాయాలను ఈనాడు వార్తాకథనంలో రాశారని సాక్షి ఆరోపించింది. ఈనాడు వార్తాకథనంలోని లోపాలను సాక్షి వార్తాకథనం ఎత్తి చూపే ప్రయత్నం చేసింది.












Click it and Unblock the Notifications