హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైభవంగా చిలుకూరు బ్రహ్మోత్సవాలు ప్రారంభం

By Santaram
|
Google Oneindia TeluguNews

Chilkur Balaji
మొయినాబాద్‌: చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఎనిమిది రోజుల పాటు కన్నుల పండువగా జరిగే చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసరాఘవాచార్యుల ఆధ్వర్యంలో అంకురార్పణ చేశారు. పుట్టమన్ను తెచ్చి దాంతో హోమగుండాల పక్కన నవధాన్యాల పాలికలు కలిపి హోమాలను వెలిగించారు. విష్వక్సేనుడి ఆరాధన, పుణ్యహవచనంతో కార్యక్రమాలను ప్రారంభించారు. ఆలయాన్ని మంత్రోచ్ఛరణలతో శుద్ధి చేశారు. ఏడు రోజులపాటు శుద్ధితో పూజలను నిర్వహిస్తారు. ప్రతి ఏడాదిలాగే పినపర్తి నరసింహాచార్యులు చేతుల మీదుగా ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయని పూజారులు తెలిపారు.

శుక్రవారం ధ్వజారోహణం అనంతరం గరుడదేవునికి పూజ నిర్వహిస్తామని ఆలయకమిటీ కన్వీనర్‌ గోపాలకృష్ణస్వామి, పూజారి రంగరాజన్‌ లు చెప్పారు. పిల్లలు లేని మహిళలు గరత్మంతుని(గరుడ) ప్రసాదం తింటే తప్పనిసరిగా వారికోరిక నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X