హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీలో బూతులు, తిట్లే: జెపి

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
హైదరాబాద్: శాసనసభలో బూతులు, తిట్లే తప్ప అంశంపై లోతైన చర్చ జరగలేదని లోకసత్తా శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. గర్భిణులకు రూ. 2కోట్లతో రుబెల్లా టీకాలు ఇస్తే రోజుకు వంద మంది బిడ్డలకు అంగవైకల్యం రాకుండా ఆపొచ్చునని, రూ. 1.13 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం రూ. రెండు కోట్లు కేటాయించలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీకి ఎందుకు ఎన్నికయ్యానా అని బాధపడుతున్నానని ఆయన అన్నారు. అంగవైకల్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ పేరు మీద కార్పొరేటు ఆస్పత్రులకు ఒక్కో కేసుకు రూ. లక్ష నుంచి 8 లక్షల వరకు ఖర్చు పెట్టే ప్రభుత్వం దాన్ని నివారించడానికి మాత్రం రూ. 2 కోట్లు కేటాయించడం లేదని అన్నారు. అమె రికాలో అక్కడ ఆరోగ్యరంగంలో మార్పుపై సమగ్ర చర్చ జరిగిందన్నారు.

అన్ని వసతులతో ప్రభుత్వం రాష్ట్ర వ్యా ప్తంగా 400 ఆస్పత్రులను నిర్మిస్తే ఒక్కోదానికి రూ. 2 కోట్ల చొప్పున 800 కోట్లు ఖర్చవుతుందని, 2 కోట్ల మంది ఔట్ పేషంట్లకు, 15 లక్షల మంది ఇన్‌పేషెంట్లకు ఉచితంగా వైద్యం అందించవచ్చన్నారు. కాగా, విద్యుత్తు లేక పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించామంటే మనం అభివృద్ధి చెందుతున్నట్లా, నాశనమవుతున్నట్లా అని జేపీ ప్రశ్నించారు. ప్రభుత్వం విద్యుత్తు ఇవ్వకపోవడం వల్ల 22 చిన్న పరిశ్రమల సమాఖ్యలు నిరాహారదీక్షకు కూర్చున్నాయన్నారు. వీటికి 250 మెగావాట్లే ఇవ్వలేని ప్రభుత్వం ఐదువేల మెగావాట్లతో ఎత్తిపోతల పథకాలు ఎలా నడుపుతుందని జేపీ ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X