వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎర్త్ అవర్ లో దట్స్ తెలుగు డాట్ కాం సైతం...

By Santaram
|
Google Oneindia TeluguNews

We have joined the wagon Earth Hour
హైదరాబాద్: మనం రోజూ ఎన్నో గంటలు మన వృత్తి కోసం మన కుటుంబం కోసం వెచ్చిస్తాం. మనకు ప్రధాన జీవనాధారమైన భూమి గురించి సంవత్సరానికి ఒక గంట ఇవ్వలేమా? ఇదే ఆలోచనతో ప్రపంచ వ్యాప్తంగా 27 మార్చి శనివారం నాడు ఎర్త్ అవర్ ను పాటిస్తున్నారు. భూమి మీద వాతావరణం మెరుగుపడేందుకు, సహజమైన పరిస్ధితులు నెలకొనేందుకు ప్రజల్లో జాగృతిని తెచ్చే ఆలోచనే ఈ ఎర్త్ అవర్. ఈ ఆలోచనను ఇంకా ముందుకు తీసుకెళ్ళేందుకు దట్స్ తెలుగు మీకు ఈ ఆర్టికల్ ను అందిస్తోంది.

నాలుగేళ్ళుగా ఈ కార్యక్రమం సాగుతోందని, 125 దేశాల్లోని వేలాది పట్టణాలు, నగరాలు ఇందులో పాలు పంచుకుంటున్నాయని నిర్వాహకులు చెప్పారు. ప్రంపచ ప్రఖ్యాత గ్రేట్ పిరమిడ్స్, ఈఫెల్ టవర్, ప్రాచీన చైనా నగరం లలో శనివారం కొంత సేపు విద్యుత్ ఉండదు. భూమాత అందిస్తున్న వనరులు అధిక వినియోగమవుతున్నాయని, వాటిని తగ్గించుకుని ప్రకృతి సమతౌల్యానికి పాల్పడాలన్న సందేశాన్ని ఈ ఎర్త్ అవర్ ఇస్తోంది.

కాలుష్యం పెరిగిపోవడం, ఆడవులు అంతరించిపోవడం, పర్యావరణ సమతుల్యత నశించడం వంటి కారణాల వల్ల భూమండలం వేడెక్కిపోతోంది. కాలుష్యం వల్ల ఓజోన్ పొర పలుచబడిపోతోంది. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఈసారి ప్రజల్లో ఎర్త్ అవర్ పై అవగాహన బాగా పెరిగిందని నిర్వాహకులు అంటున్నారు. రాజకీయ నాయకులు కలిసి రాకపోయినా ప్రజలు, సంస్ధలు స్వచ్చందంగా ఈ ప్రచార యాగంలో పాలు పంచుకుంటున్నాయని చెప్పారు.

భారతదేశంలోని అతి పెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన ఐసిఐసిఐ ఎర్త్ అవర్ ను పాటిస్తోంది. రేపు శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 వరకు బ్యాంకు శాఖల్లోను, ఎటిఎం లలోనూ పవర్ పవర్ ఆఫ్ చేస్తారు. అయితే ఎటిఎం లలో ఎమర్జెన్సీ లైటింగ్ ఉంటుంది. ఎటిఎంలు యధావిధిగా పనిచేస్తాయి. మిగతా వన్నీ స్విచ్ ఆఫ్ చేయబడతాయి. మల్టీ నేషనల్ బ్యాక్ హెచ్ ఎస్ బిసి కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X