కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో లోయర్ మానేరు డ్యామ్ లో మునిగి ముగ్గురు పిల్లలు మరణించారు. ఈ సంఘటన శుక్రవారమే జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతులు తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందినవారు. వారిని రాజు, ప్రసాద్, సంపత్ లుగా గుర్తించారు.
ఐదుగురు పిల్లలు శుక్రవారం లోయర్ మానేరు డ్యామ్ లో ఈతకు వెళ్లారు. వారిలో ముగ్గురు డ్యామ్ లో గల్లంతయ్యారు. ఆ ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు.