అమితాబ్ నేరమేమీ చేయలేదు: థాకరే

షారూఖ్ ఖాన్ పాకిస్తాన్ వకాల్తా పుచ్చుకుంటే కాంగ్రెసుకు నచ్చిందని, అమితాబ్ మాత్రం నచ్చలేదని ఆయన అన్నారు. అమితాబ్ హాజరు కావడం వల్ల సీలింక్ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రతిష్ట పెరిగిందని ఆయన అన్నారు. అమితాబ్ దొంగ, బందిపోటు, ఉగ్రవాది కాడని ఆయన అన్నారు. గుజరాత్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందుకు అమితాబ్ ను కాంగ్రెసు లక్ష్యంగా చేసుకుందని, ముంబైలో నివసిస్తున్న అంబానీ, టాటా గుజరాత్ లో పెట్టుబడులు పెట్టారని, నరేంద్ర మోడీ గుజరాత్ లో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నారని వారిని అడిగే దమ్ము కాంగ్రెసుకు ఉందా అని ఆయన అన్నారు. అమితాబ్ దేశానికి చెందినవాడని, అలాగే ఉంటాడని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications