అధికారులపై తుపాకి గురి పెట్టం: సిఎం

ఎపిపిఎస్సీ అక్రమాలపై చర్చ సాధ్యం కాదని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. మరో రూపంలో వస్తే ఎపిపిఎస్సీ అక్రమాలపై చర్చకు అనుమతిస్తామని చెప్పారు. అయినా తెలుగుదేశం సభ్యులు వినిపించుకోలేదు. చేసిన ఆరోపణలను రుజువు చేయలేక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కె. రోశయ్య వ్యాఖ్యానించారు. ఆ అంశాన్ని ఇంతటితో వదిలేద్దామని, ఆరోపణల్లో వాస్తవాలుంటే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అయినా తెలుగుదేశం సభ్యులు తమ పట్టు వీడకుండా చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభ రెండో సారి 15 నిమిషాల పాటు వాయిదా పడింది.












Click it and Unblock the Notifications